ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ తోనే మోదీ రాజకీయ కుట్రలను భగ్నం చేయగలం..రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్..

ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ తోనే మోదీ రాజకీయ కుట్రలను భగ్నం చేయగలం..రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్..
హైదరాబాద్, 04 అక్టోబర్ :ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణ తోనే మోదీ రాజకీయ కుట్రలను భగ్నం చేయగలమని రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణా అభివృద్ధికి కేసీఆర్ , రేవంత్ రెడ్డి తీతుకు పిట్టల మాదిరి అడ్డంకిగా మారారని , ఆంధ్ర రాష్ట్రా భవిష్యత్ కు చంద్రబాబు కూటమి సర్కార్ మాంత్రిక శాపగ్రాస్తుల మాదిరి మాటల గారడితొ పాలకులుగా చలామణి అవుతున్నారు. ఈ ప్రస్తుత పాలకులకు , ప్రతి పక్షాలకు పాలన కన్నా వారి భలహీనతలకు ఇరు రాష్ట్రాల భవిష్యత్ ను మోదీ రాజకీయ అవసరాలకు తాకట్టు పెట్టేస్తున్నారు . ఆంధ్ర – తెలంగాణా లో ప్రతిపక్షాలు సైతం మోదీ సర్కార్ కు బానిసలు గానే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చును . ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార ప్రతి పక్షాలకు కుర్చి కోసం తగువులు తప్ప ప్రజా సంక్షేమం, రాష్ట్రాల భవిష్యత్ వీరికి అక్కరకు లేకపోతుంది . కార్పొరేట్ శక్తుల కనుసైగ లో మోదీ సర్కార్ , మోదీ కి బానిసలుగా ఆంధ్ర – తెలంగాణా అధికార ప్రతిపక్షాలు ఒక గమ్మతైన రాజకీయ క్రీడను సంయుక్తంగా నడిపించుకుంటు ఎవరికి వారు సొంత ప్రయోజనాలతొ లాభపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్నటు వంటి మేధావులు , ఉద్యమ కారులు కోల్పోయిన భవిష్యత్ ను , పోగొట్టుకున్న సంపదను యుద్ధ ప్రాతిప్రదికన తిరిగి సాధించుకోవటానికి ఏకం కావాలన్నారు . రెండు తెలుగు రాష్ట్రాల సంయుక్త కార్యాచరణ తోనే మోదీకి ముచ్చెమటలు పడతాయని , ఆంధ్ర, తెలంగాణా సంపన్న రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుతాయని , ఇరు రాష్ట్రాల్లో సంయుక్తంగా ప్రత్యామ్నాయ ప్రజా కూటమి ఏర్పాటుకు మేధావులు , ఉద్యమ కారులు కలసి రావాలని ఆయన కోరారు .
అధికార దుర్వినియోగం , ఈ వి ఎమ్ మోసాలను అరికట్టనన్నాళ్ళు మోదీకి అధికారం వుంటుంనే ఉంటుందా ! అనే సందేహాలు భారతదేశ ప్రజలను వెంటాడుతున్నాయి . ప్రజల ఓటును దొంగిలిస్తు కేంద్ర ప్రభుత్వ పరిపాలనను మోదీ హస్తగతం చేసున్నారని ప్రస్తుత ఎన్నికల సంఘం పని తీరును బట్టి భారతీయుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి . మోదీ అధికారం చేపట్టిన నుండి ఆంధ్ర , తెలంగాణా రాష్ట్రాల భవిష్యత్ అతలా కుతలంగా మారింది . తెలంగాణా లో రాజకీయ పాలన మొత్తం హైదరాబాద్ చుట్టూనే తిప్పుతున్నారు . ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పుల ఉబిలో తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ ను ముంచేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్రంకు కాంగ్రెస్ పార్టి నుండి ముఖ్యమంత్రి అయినప్పటికి మోదీ మార్కు రాజకీయాన్నే అనుసరిస్తు విశ్వ సృష్టికే లయ కారకుడైన పరమశివుని కోసం , అఖండ భారతదేశానికే ఉత్తమ దైవ ఆరాదికుడైన శ్రీరాముని కోసం అజ్ఞాన ప్రసంగాలు సాగిస్తు మతోన్మాద ఉన్మాద చర్యలకు పూనుకుంటున్నారు . ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం వారి సొంత మీడియా ల్లోనే కనపడుతుందన్నారు . ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన ఆదాయ మార్గాలు ఉన్నప్పటికి లక్షల కోట్లు ఋణాలు చేస్తు ప్రజలకు భవిష్యత్ లేకుండా చేయటమే కూటమి సర్కార్ దీర్ఘకాలిక రాజకీయ కుట్ర వ్యూహం అన్నారు . అద్భుతమైన ఆదాయ మార్గాలు గల ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అనంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోక పోవటం ఆంధ్రుల దురదృష్టంగా బావిస్తున్నారని , తెలుగు రాష్ట్రాల్లో పాలిస్తున్న అధికార ప్రతి పక్షాలకు నిత్యం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అగ్గి రాజేయటం, శాంతి భద్రతల సమస్యల ను సృష్టించటం తప్ప అభివృద్ధికి ఆదర్శంగా నిలవలేని అసమర్థులు ఆంధ్ర , తెలంగాణా లో పాలకులుగా రాజ్యమేలు తున్నారని ఆయన ఏద్దేవా చేసారు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో గల సహజ వనరులు , ఖనిజ సంపదను , వ్యాపార మార్గాలను మన రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికే వినియోగించే విధంగా రాజకీయ ప్రక్షాళన దిశగా ప్రజా పొరుబాటకు సిద్దపడాలన్నారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో గల సంపదతొ ప్రపంచంలో ఏ ధనిక దేశం పోటి పడలేదన్నారు . మన తెలుగు రాష్ట్రాల సంపద మన అభివృద్ధి కోసం కాకుండా మోదీ రాజకీయ అవసరాలకు ఉత్తరప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలకు దారి మళ్ళిస్తు మోదీ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు . సంపద మొత్తం తెలుగు రాష్ట్రాలది , సోకులు , అధికారాలు మాత్రం మోదీ రాజకీయ అవసరాలకు ఉపయోగ పడుతున్నాయి . అపార సంపద గల తెలుగు రాష్ట్రాలు పేదరికంలో మగ్గి పోతున్నాయి . ప్రజలు దేహి అని అర్దనాదాలు పెడుతున్నారు . గోంతేత్తి ప్రశ్నించినా , అరిచినా లాఠీ లతోను , సంకెళ్ళ తోను చిన్న చిన్న సెక్షన్ల కేసులకు సైతం సంబంధం లేని ఘోర మైన సెక్షన్ లను బనాయిస్తు బెయిళ్ళు రాకుండా అక్రమ కేసులు బనాయిస్తు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు . మోదీ సర్కార్ ఒక తరహా రాజకీయ కుట్రలను తెలుగు రాష్ట్రాలపై వ్యూహత్మాకంగా అమలు చేస్తున్నారు . పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిందే , లేకుంటే మనం, మన బిడ్డల భవిష్యత్ , బావితారల భవిష్యత్ మన కళ్ళ ముందనే ఆవిరై పోతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తించి ఉమ్మడి ఐఖ్య కార్యాచరణతొ మోదీ పాలనకు , మిత్ర పక్షాలకు ఘోరి కట్టాల్సిన భాద్యత ఆంధ్ర, తెలంగాణా ప్రజల భుజస్కందాల వుందని ఆయన గుర్తు చేసారు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో గల అధికార ప్రతిపక్షాలు వారి సొంతం బలహీనతలతో ప్రజల సంపదను , వనరులను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులకు ఆంధ్ర , తెలంగాణా మేధావులు , ఉద్యమ కారులు గుణపాఠం చెప్పె రోజులు దగ్గర పడుతున్నాయన్నారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో గల పాలక , ప్రతిపక్ష నేతల బానిసత్వాన్ని బాహుబలి సినిమా దర్శకులు రాజమౌళి ముందుగా గమించి వుంటే కట్టప్ప పాత్ర స్తానంలో నటించిన నటుడు సత్యారాజ్ సిగ్గుపడే వారన్నారు .ఇప్పటి వరకు ఆంధ్ర , తెలంగాణా రాష్ట్రాల నుండి పాలక ప్రతిపక్ష నేతల ఆశీస్సులుతొ దోచుకు పోయిన మన సంపదను యుద్ద ప్రతిప్రాతిపదికన తిరిగి సాధించుకోవాల్సిన గురుతర భాద్యత ప్రతి తెలుగు వారిపై వుందని గ్రహించాలి . ఆంధ్ర , తెలంగాణా లో గల అధికార ప్రతిపక్ష నేతలు ఆలీబాబా 40 దొంగలను మించి పోయారు.వీరిలో కొంతమంది నేతలు దోచుకున్న సంపదను ఏమి చేయూకోవాలో అర్ధం కాక మల , మూత్రలకు సైతం వినియోగించుకునే పరికరాలుగా వాడుకుంటు వారి వారి దోపిడి అహంకారాన్ని చాటుకుంటున్నారు . ఆంధ్ర , తెలంగాణా రాష్ట్రాల ప్రజలకు విదేశీ , స్వదేశీ కార్పొరేట్ శక్తులు , కార్పొరేట్ రాజకీయ పార్టి లతో ప్రమాదం పొంచివుంది . ప్రజలు మేలుకోక పొతే మనతొ పాటుగా , మన బిడ్డలు , బావితరాల భవిష్యత్ బూడిదగా మారతాయన్నారు . మన పేదరికం , మన త్యాగాలు బిడ్డల భవిష్యత్ కు ఉజ్వల బంగారంగా మారాలన్నా , సంపన్నులుగా నిలవాలన్నా బూజుపట్టిన కాలం చెల్లిన కొన్ని సిద్ధాంతాలను విడనాడాల్సిన అవసరం ఆసన్నమైనదని ఆ తరహా మేధావులు గ్రహించాలి . కుహనా పాలకులను , కాలం చెల్లిన నేతలను ఇంటికి సాగనంపే విజయ రాజకీయాలకు ఆంధ్ర, తెలంగాణా మేధావులు, ఉద్యమ కారులు వ్యూహ రచనకు సిద్దపడాలని , అందుకోసం జరిగే మహోన్నతమైన ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ కార్యాచరణలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి మహా కూటమిగా ఏర్పడాలని , అందుకోసం జరిగే ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని అర్పిసి అధ్యక్షులు పిలుపు నిచ్చారు .
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు ,
డి వి రమణమూర్తి , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , కారుమూరి యుగంధర్ , దుడ్డే త్రినాద్ , వాడపల్లి జ్యోతిష్ , జవ్వాది మోహన్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , చల్లా సాంబశివరావు , చల్లా శివ దుర్గారావు , పాండ్రంకి ఈశ్వరరావు , మట్టపర్తి తులసి , ఎమ్ కే ఆలీ , ఎస్ కే సమీర ,
కే. ఆంజనేయులు,కే. దుర్గా నవ్య శ్రీ , మాసా అప్పాయమ్మ , త్రిపురాల పాండవులు , దబ్బా కుమారి, అత్తిలి శ్రీనివాసరావు మాసా సుభద్ర , మాసా అపర్ణ తదితరులు పాల్గొని యున్నారు.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।




