Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Kakinada

ఎటపాకం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ఐడీ కార్డులు & ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ

08 Oct 2026, 12:33 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
ఎటపాకం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ఐడీ కార్డులు & ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ - Kakinada, आंध्र प्रदेश

భద్రాచలం, 07 అక్టోబర్ (వందే భారత్ ):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు మరియు ఉచిత ప్రమాద భీమా కార్డులను మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సూచనల మేరకు ఎటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు ఘనంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ., పార్టీకి అసలైన సైనికులు కార్యకర్తలేనని, వారి కష్టసుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అధినేత జగనన్న ప్రవేశపెట్టిన ఈ ఇన్సూరెన్స్ విధానం వల్ల ప్రతి కార్యకర్త కుటుంబానికి కొండంత ధైర్యం చేకూరుతుందని తెలిపారు. మండల కమిటీ నాయకులు మరియు ముఖ్య నేతలు స్వయంగా తమ చేతుల మీదుగా పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు ఈ ఇన్సూరెన్స్ ఐడీ కార్డులను అందజేశారు.

నాయకుల చేతుల మీదుగా కార్డులు అందుకున్న కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎటపాక మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,(పెద్దోడు) రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి) ఎటపాక మండల సోషల్ మీడియా భాగం కమిటీ అధ్యక్షులు (మాజీ ఎంపీటీసీ గుండాల) గొంగడి వెంకటరామిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షులు తోట శశి కుమార్ చల్లమని, పెనుబల్లి కోటేష్ పులుసు వంశీ, కాటo స్వరూప, సుజాత, వినోద్, నరేష్ భద్రయ్య, పాపారావు, సోడే ప్రసాదు, ఎడ్ల ప్రసాదు, పండు బాబు, నూతి రమేష్, బోయిన శీను బాబురావు, మరియు కార్యకర్తలు కార్డు లబ్ధిదారులు ,తదితరులు పాల్గొన్నారు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

फूलपुर में सजेगी बिरहा की महफिल, सुभद्रा चौहान और देवी लाल यादव के बीच होगा शानदार मुकाबला
Azamgarh16 Oct

फूलपुर में सजेगी बिरहा की महफिल, सुभद्रा चौहान और देवी लाल यादव के बीच होगा शानदार मुकाबला

फूलपुर में सजेगी बिरहा की महफिल, सुभद्रा चौहान और देवी लाल यादव के बीच होगा शानदार मुकाबला रिपोर्टर-…

पूरी खबर पढ़ें →
ਫਰੀਦਕੋਟ ਦੇ ਅੱਖਾਂ ਦੇ ਮਾਹਿਰ ਡਾਕਟਰ ਸੰਜੀਵ ਗੋਇਲ ਨੇ ਸਾਬਕਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮਨੋਹਰ ਲਾਲ ਖੱਟਰ ਜੀ ਨਾਲ ਕੀਤੀ ਵਿਸ਼ੇਸ਼ ਮੁਲਾਕਾਤ
Faridkot16 Oct

ਫਰੀਦਕੋਟ ਦੇ ਅੱਖਾਂ ਦੇ ਮਾਹਿਰ ਡਾਕਟਰ ਸੰਜੀਵ ਗੋਇਲ ਨੇ ਸਾਬਕਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮਨੋਹਰ ਲਾਲ ਖੱਟਰ ਜੀ ਨਾਲ ਕੀਤੀ ਵਿਸ਼ੇਸ਼ ਮੁਲਾਕਾਤ

ਪ੍ਰਤੀਕ ਸੇਠੀ.... ਵੰਡੇ ਭਾਰਤ ਨਿਊਜ਼ ਫਰੀਦਕੋਟ..... ਫਰੀਦਕੋਟ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਜ਼ਿਲ੍ਹਾ ਫਰੀਦਕੋਟ ਦੀ ਅਨੁਸ਼ਾਸਨੀ ਕਾਰਵਾਈ ਕਮੇਟੀ ਦੇ ਕਨਵੀਨਰ…

पूरी खबर पढ़ें →
🚨 ब्रेकिंग न्यूज़: बरसाना देहात और नगर पंचायत के बीच कानूनी विवाद, विकास की राह में जनता क्यों परेशान?
Mathura16 Oct

🚨 ब्रेकिंग न्यूज़: बरसाना देहात और नगर पंचायत के बीच कानूनी विवाद, विकास की राह में जनता क्यों परेशान?

🚨 ब्रेकिंग न्यूज़: बरसाना देहात और नगर पंचायत के बीच कानूनी विवाद, विकास की राह में जनता क्यों…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
error: Content is protected !!