మాజీ MPTC తుర్రం జగదీష్పై విమర్శలు సరికాదు !

వందే భారత్, 11 అక్టోబర్ : YSR సీపీ నాయకులు దేవీపట్నం మాజీ ఎంపీటీసీ జగదీష్ దొర పై కొందరు దేవీపట్నం మండల YSRCP నాయకులు చేసిన విమర్శలు సరికాదని గంగవరం మండల YSRCP నాయకులు పత్రిక విలేకర్ల సమావేశం లో అభిప్రాయబడ్డారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడి పై విమర్శలు చేసే ముందు ఆయన రాజకీయ నేపథ్యాన్ని,పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించాలని వారు సూచించారు.తుర్రం జగదీష్ దొరకు 26 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని,ఆయన కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమని నాయకులు పేర్కొన్నారు.ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ.,ప్రజలతో,కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు పార్టీ బలోపేతం గురించి మాట్లాడితే దానిని తప్పుగా అర్థం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కి కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని తుర్రం జగదీష్ సూచించడంలో తప్పేముందని నాయకులు ప్రశ్నించారు.పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని,ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం తప్పెలా అవుతుందని వారు అన్నారు.రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్లడం ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు.గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే నాయకులు,కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని,అందరినీ కలుపుకొని పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
తుర్రం జగదీష్ దొర గత ఎన్నికల్లో కూటమికి సహకరించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గంగవరం మండల నాయకులు స్పష్టం చేశారు.గతంలో రంపచోడవరం నియోజకవర్గ పార్టీ అధిష్ఠానం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ,తుర్రం జగదీష్ దొర క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి అండగా నిలుస్తూ,పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని వారు పేర్కొన్నారు.పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ కార్యకర్తలతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడి పై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వారు అన్నారు.కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి సూచించడం పార్టీ ప్రయోజనాల కోసమేనని,దానిని వేరే విధంగా చిత్రీకరించడం తగదని స్పష్టం చేశారు.పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమని,వాటిని వ్యక్తిగత విమర్శలుగా తీసుకోకుండా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చర్చించుకోవాలని నాయకులు సూచించారు.పార్టీ కోసం పనిచేసే నాయకులపై విమర్శలు చేయడం కంటే,వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలంటే నాయకత్వం కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకొని,గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని వారు సూచించారు.వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా సమిష్టిగా పనిచేసినప్పుడే కార్యకర్తల్లో ఐక్యత పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ ప్రెస్ మీట్ లో తుర్రం లిలావత(మాజీ సర్పంచ్),కుంజం సత్యవతి (గంగవరం మండల మహిళా నాయకురాలు),కుంజం శ్రీను (గంగవరం మండల నాయకులు),కుంజం పద్మావతి (మాజీ ఎంపీటీసీ) తదితర నాయకులు పాల్గొన్నారు.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।






