ఖమ్మం కార్పొరేషన్ వద్ద భారీ ధర్నా

పేదల ఇళ్ల తొలగింపు నోటీసులను ఉపసంహరించుకోవాలి!
ఖమ్మం కార్పొరేషన్ వద్ద భారీ ధర్నా
ఖమ్మం, 15 సెప్టెంబర్ : ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో గత యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించాలని మున్సిపల్ అధికారులు అందించిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సమస్య పైన మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా బాధితులతో సిపియం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం ఖమ్మం డివిజన్ నాయకులు ఎస్కే సైదులు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత యాబై సంవత్సరాల నుండి శ్రీనివాస నగర్ ప్రాంతంలో పక్కా ఇళ్లను నిర్మించుకొని వేల మంది పేదల నివసిస్తున్నారని, అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అని ఇప్పుడు ఆ ఇళ్ల నిర్మాణాలని తొలగించాలని మునిసిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. గత 50 సంవత్సరాల నుండి మున్సిపల్ టాక్స్ లు, కరెంట్ బిల్లులు కడుతున్నారు అని తెలిపారు.రోజు వారీ కూలీ పనులు,వివిధ చేతి వృత్తులు చేసుకుంటూ సాదాసీదా జీవనాన్ని కొనసాగించే పేదలపైన ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం పద్ధతి కాదని అన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతమని, 60 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు విస్తరణ అనే పేరు మీద పేదలని ఈ ప్రాంతం నుండి తరిమి వేయాలనే దుర్దేశంతో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం నుండి పేదలు వెళితే తమ ఆస్తులకి విలువలు పెరుగుతాయనే దురుద్దేశంతోనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు పేదల ఇళ్లను తొలగించమని నోటీసులు ఇచ్చారని, 15 రోజుల్లో తొలగించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరికలు జారీ చేశారని అన్నారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకొని , పేదలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.గౌరవ మంత్రి పేదల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఈ సమస్య మరో వెలుగుమట్లగా మారుతుందని హెచ్చరించారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా టింబర్ (చెక్క కోత మిషన్ లు) పరిశ్రమలు వుండటం ఫలితంగా ఈ ప్రాంతం ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం అంతా నివాస ప్రాంతాలు వెంటనే ఇక్కడ నుండి ఈ చిన్న తరహా పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి, వివిధ స్కూల్స్, పెట్రోల్ బంక్ లు వుండటం వల్ల ఈ టింబర్ చెక్క కోత పరిశ్రమలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ మిషన్ లు ఫలితంగా చెక్క దుమ్ము ధూళి తో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.
బాధితులు అధైర్యపడవద్దని, సిపీయం పార్టీ అండగా ఉంటుందని,అందుకు అవసరమైన ప్రజా పోరాటాల్ని,న్యాయ పోరాటాల్ని నిర్వహిస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.అనంతరం మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో సిపియం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్,పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రనివాసరావు,మెరుగు సత్యనారాయణ, త్రీ టౌన్ కార్తదర్శి భుక్యా శ్రీనివాసరావు,జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, డివిజన్ నాయకులు యర్రా గోపి, వజినేపల్లి శ్రీనివాసరావు,బండారు యాకయ్య, SK ఇమామ్,యర్రా రంజిత్, బండారు సునీత తదితరులు పాల్గొన్నారు.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







