Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Khammam

మార్క్స్‌–లెనిన్‌ల ఉత్తమ శిష్యుల ఉండటమే ఉత్తమ కమ్యూనిస్ట్ లక్షణం.. పల్లెప్రపంచం ఫౌండేషన్‌ అధ్యక్షులు పల్లా కొండలరావు…

04 Oct 2026, 06:44 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
మార్క్స్‌–లెనిన్‌ల ఉత్తమ శిష్యుల ఉండటమే ఉత్తమ కమ్యూనిస్ట్ లక్షణం.. పల్లెప్రపంచం ఫౌండేషన్‌ అధ్యక్షులు పల్లా కొండలరావు... - ఖమ్మం, तेलंगाना

మార్క్స్‌–లెనిన్‌ల ఉత్తమ శిష్యులుగా ఉండడమే మంచి కమ్యూనిస్ట్‌ లక్షణం..పల్లెప్రపంచం ఫౌండేషన్‌ అధ్యక్షులు పల్లా కొండలరావు..

బోనకల్(ఖమ్మం జిల్లా /తెలంగాణా ): వర్గరహిత సమాజాన్ని సాధించాలంటే ప్రతి కమ్యూనిస్ట్‌ మార్క్స్‌, లెనిన్‌ల ఉత్తమ శిష్యుడిగా ఎదగాలని పల్లెప్రపంచం ఫౌండేషన్‌ అధ్యక్షులు పల్లా కొండలరావు అన్నారు. సమాజాన్ని మార్చాలంటే కేవలం కమ్యూనిస్టుగా చెప్పుకునే వారు సరిపోరని, నిరంతరం అధ్యయనం చేస్తూ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యకర్తలు అవసరమని తెలిపారు. ఆదివారం బోనకల్‌ సీపీఎం కార్యాలయంలో “మంచి కమ్యూనిస్ట్‌ ఎలా ఉండాలి?” అనే అంశంపై స్టడీ సర్కిల్‌ నిర్వహించారు. స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా కొండలరావు మాట్లాడుతూ మార్క్సిజం పిడివాదం కాదని, సర్వకాల సర్వావస్థలలలోనూ ఒక సామాజిక, తత్వ శాస్త్రమని, నిర్దిష్ట పరిస్థితులకు దానిని అన్వయించి మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు మొదటిగా లెనిన్‌ కృషి చేశారని వివరించారు.
మార్క్స్‌, లెనిన్‌లు మానవాతీత శక్తులు కాదని, స్వీయ సాధన ద్వారా ప్రతి కమ్యూనిస్ట్‌ కూడా వారి మాదిరిగా అద్వితీయమైన సైద్ధాంతిక అవగాహనను పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని, సిద్ధాంతాన్ని వాటికి అన్వయించి ఆచరించడంలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి కమ్యూనిస్టు స్వీయ సాధన చేస్తే తనను తాను అభివృద్ధి చేసుకోవడమే గాక మొత్తం మానవాళిని పట్టిపీడిస్తున్న ఋగ్మతలకు మందులా పరిష్కారాలు చూపే కాగడానే మార్క్స్ సిద్ధాంతం అన్నారు.
మార్క్స్‌ స్వయంగా పోరాటయోధుడని, అరుదైన విప్లవకారుడని, శ్రామికవర్గ విముక్తితో పాటు ప్రపంచ ప్రజానీకం విముక్తి కోసం సిద్ధాంతాన్ని రూపొందించేందుకు తన కుటుంబ, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని ఎంగెల్స్‌ చెప్పిన విషయాలను పల్లా కొండలరావు ప్రస్తావించారు.

చిన్న చిన్న విజయాలపై కేంద్రీకరించడం ద్వారా పెద్ద విజయాలను సాధించేందుకు అవి ఆయుధాలుగా ఉపయోగపడతాయని లెనిన్‌ ఆదేశించినట్లు కామ్రేడ్‌ స్టాలిన్‌ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతి చిన్న విజయాన్ని భవిష్యత్తులో సాధించాల్సిన పెద్ద విజయాలకు పునాదిగా మలచుకోవాలని సూచించారు.

మార్క్స్‌ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా పడికట్టు పదాలతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, కార్యకర్తలపై పెత్తనం చేస్తూ, తమకు తామే నాయకులుగా, గొప్ప సిద్ధాంతవేత్తలుగా ప్రకటించుకునేవారు కమ్యూనిస్ట్‌ పార్టీలో “చీడ పురుగుల్లాంటి వారు” అని చైనాకు చెందిన ప్రముఖ మార్క్సిస్టు సిద్ధాంతవేత్త లీ షావ్ చీ చెప్పిన విషయాన్ని పల్లా కొండలరావు ప్రస్తావించారు. అలాంటి వారు సరైన సైద్ధాంతిక అవగాహన పెంచుకుని ఆచరణలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలు కూడా నిరంతరం అధ్యయనం చేసి, సైద్ధాంతిక అవగాహనను పెంచుకుని అలాంటి ధోరణులను ప్రశ్నించాలని, అలాంటివారిని పార్టీనుండి ఏరివేసి పార్టీని రక్షించుకోవాలని సూచించారు.
అదే సమయంలో మార్క్సిజాన్ని అవగాహన చేసుకుని త్యాగాలతో పార్టీ కోసం, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారి సంఖ్య నేటికీ కమ్యూనిస్టుల్లోనే ఎక్కువగా ఉందన్నారు. అయితే ఆ స్థితితో సంతృప్తి చెందకుండా ప్రతి సభ్యుడు నిరంతరం తనను తాను సమీక్షించుకోవాలని, వ్యక్తిగతంగా ఎదుగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.లెనిన్‌ చెప్పినట్లు నూతన జీవన విధానాన్ని, నూతన సంస్కృతిని, నూతన సమాజాన్ని నిర్మించేందుకు నిరంతరం అధ్యయనం చేయడం, మెలుకువగా పరిస్థితులను గమనించడం, సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి ఆచరించడం, ఆచరణ ఫలితాలను సమీక్షించుకుని ముందడుగు వేయడమే మార్క్సిస్టు ఆచరణ అని పల్లా కొండలరావు అన్నారు. అలాంటి నిరంతర అధ్యయనం, ఆచరణ, స్వీయ సమీక్ష కలిగిన వారే మార్క్స్‌, లెనిన్‌ల ఉత్తమ శిష్యులుగా నిలవగలరని తెలిపారు.

ఈ స్టడీ సర్కిల్‌లో సీపీఎం జిల్లా నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, ఐద్వా మధిర డివిజన్‌ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత, సీఐటీయూ నేతలు గుగులోతు నరేష్, బోయినపల్లి వీరబాబు, కూచిపూడి మురళి, బొప్పాల రమేష్, కంసాని సూర్యప్రకాశ్రావు, బూర్గుల అప్పాచారి, బిల్లా విశ్వనాథం, గద్దె రామారావు, కుక్కల కోటేశ్వరరావు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, పొన్నం ఉపేందర్, చామర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा
Jodhpur18 Oct

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा

जोधपुर : मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा कि भारतीय संस्कृति कर्तव्यों पर आधारित रही है और इन्हीं कर्तव्यों…

पूरी खबर पढ़ें →
*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*
Ayodhya18 Oct

*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*

*ब्रेकिंग न्यूज़ अयोध्या* *अनूप कुमार रिपोर्टर अयोध्या* *अयोध्या* पावन नवरात्रि के अवसर पर धर्मनगरी अयोध्या में भक्ति का…

पूरी खबर पढ़ें →
भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया
Jodhpur18 Oct

भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया

जोधपुर : शहर जिला कांग्रेस कमेटी के प्रवक्ता डॉ.संजय गौड ने बताया कि हाल ही में प्रदेश भाजपा…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!