పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


భద్రాచలం, 13 నవంబర్ :పోలవరం జిల్లాలోని చింతూరు, ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం విలీన మండలాల ప్రజలు, గిరిజన కక్షిదారులు, సాక్షులు మరియు న్యాయవాదులు కోర్టు విచారణల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఎదుర్కొంటున్న ఆర్థిక భారంతో పాటు రోజువారీ కూలీ నష్టాన్ని నివారించేందుకు చింతూరు రెవెన్యూ డివిజనల్ కేంద్రంలో గానీ లేదా ఎటపాక మండల కేంద్రంలో గానీ పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలని కోరుతూ "విలీన మండలాల న్యాయవాదుల సంఘం" ప్రతినిధులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. హరినాథ్ కి, జస్టిస్ బట్టు దేవానంద్ కి మరియు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించారు.
నాలుగు ఏజెన్సీ మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుండి స్థానికంగా కోర్టు లేకపోవడంతో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అన్ని మండలాలకు రవాణా సౌకర్యం ఉన్న ఎటపాక లేదా చింతూరులో రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును వెంటనే మంజూరు చేసి గిరిజనుల గడప వద్దకే సత్వర న్యాయం అందించాలని న్యాయవాదుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, విలీన మండలాల న్యాయవాదుల సంఘం సభ్యులు పేరాల నాగరాజు, పామరాజు తిరుమలరావు, వలవల సురేష్ కుమార్, కొత్తపల్లి రాంబాబు, విజ్జగిరి రవితేజ, సున్నం వెంకటరమణ, మోసం సంజీవరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

*मुख्यमंत्री जन विश्वास अभियान अंतर्गत हरिनगर में आयोजित हुआ जन विश्वास शिविर* *15 ग्राम पंचायतों में आयोजित हुई…
पूरी खबर पढ़ें →
आगर-मालवा, 13 नवंबर। आमतौर पर एलएलएम की पढ़ाई पूरी करने के बाद युवा वकालत या किसी प्रतिष्ठित पेशे…
पूरी खबर पढ़ें →
आगर-मालवा, 13 नवंबर। मुख्यमंत्री लाड़ली बहना योजना के तहत शुक्रवार को आगर-मालवा जिले की 1 लाख 13 हजार…
पूरी खबर पढ़ें →
आगर-मालवा, 13 नवंबर। प्रशासनिक व्यवस्था को अधिक संवेदनशील, जवाबदेह और जनहितैषी बनाने के उद्देश्य से जिले में कर्मयोगी…
पूरी खबर पढ़ें →
धनबाद(DHANBAD): काले हीरे की नगरी धनबाद में काले धंधे की लंबी फेहरिश्त है. काला धंधा करने वाले रेलवे…
पूरी खबर पढ़ें →
आगर-मालवा, 13 नवंबर। सरकारी योजनाओं का लाभ पात्र हितग्राहियों तक समय पर नहीं पहुंचाने और मैदानी स्तर पर…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।