
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. మెడికల్ కాలేజ్ ని కొడంగల్ తరలించకుండా ఈ ప్రాంతంలోనే ఉండాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరారు.గతం లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ తో పాటు 100 పడకల మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించింది నిధులు కూడా మంజూరు చేశారు స్థలం కూడా పరిశీలించారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఎందరో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు .మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించవద్దని తరలించే ప్రయత్నాలు విరమించుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.